♦ శాంతి చర్చల దిశగా అడుగులు
♦ పాకిస్థాన్‌లో శాంతి చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్‌ను పంపించనున్న ట్రంప్
ఇరాన్- అమెరికా చర్చల కోసం ఇస్లామాబాద్‌కు ప్రయాణించాలనుకునే వారికి విమానాశ్రయం చేరుకున్న వెంటనే వీసాలను(వీసా ఆన్ అరైవల్) జారీ చేయనున్నట్టు శుక్రవారం(ఏప్రిల్ 10) పాకిస్థాన్ తెలియజేసింది.
ఇది ఈ సమావేశం పట్ల ప్రపంచ మీడియాకు ఉన్న ఆసక్తిని సూచిస్తోంది.
న్యూఢిల్లీ: ఇరాన్ – అమెరికా చర్చల కోసం ఇస్లామాబాద్‌కు ప్రయాణించాలనుకునే వారికి చేరుకున్న వెంటనే వీసాలను జారీ చేయనున్నట్టు శుక్రవారం(ఏప్రిల్ 10) పాకిస్థాన్ తెలియజేసింది.
ఇది ఈ సమావేశం పట్ల ప్రపంచ మీడియాకు ఉన్న ఆసక్తిని సూచిస్తోంది.
చర్చల కోసం బయలుదేరిన జేడీ వాన్స్..
విదేశీ సైనిక జోక్యాలను తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు, అంతులేని యుద్ధాల్లోకి బలగాలను పంపే ఆలోచనను బహిరంగంగా విమర్శించే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇరాన్‌తో జరగనున్న మధ్యవర్తిత్వ చర్చలకు నాయకత్వం వహించేందుకు శుక్రవారం బయలుదేరారు.
కన్నుమూసిన ఇరాన్ మాజీ మంత్రి ఖరాజీ..
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి ఆఖర్లో ఇరాన్‌పై అమెరికా – ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు సంప్రదింపుల్లో పాల్గొన్న ఇరాన్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి తీవ్ర గాయాలతో ఏప్రిల్ 9 రాత్రి కన్నుమూశారు.
కమాల్ ఖరాజీని లక్ష్యంగా చేసుకుని గత వారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఆయన భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులు మృతి చెందారు.
ఖరాజీ నేపథ్యం..
ఇరాన్ సంస్కరణవాద అధ్యక్షుడు మహ్మద్ ఖతామీ హయాంలో ఖరాజీ విదేశాంగ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడిలోనే మరణించిన దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి విదేశీ వ్యవహారాల సలహాదారుడిగా ఖరాజీ సేవలందించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
