ఇప్పటి వరకు ఇజ్రాయెల్- అమెరికా ఇరాన్‌పై సాగిస్తోన్న యుద్ధంలో 1300మంది ఇరాన్ పౌరులు, లెబనాన్‌లో 880 మంది, ఇజ్రాయెల్‌లో 12మంది చనిపోయినట్టు ఆయా దేశాలు వెల్లడించాయి.
మంగళవారం ఉదయం వేకువ జామున ఇజ్రాయెల్- అమెరికాలు ఇరాన్‌పై దాడి ఉద్ధృతిని పెంచాయి.
అంతేకాకుండా, లెబనాన్‌పై కూడా దాడులు మొదలు పెట్టాయి. ఇరాన్ ప్రయోగించిన రెండు క్షిపణులు ఇజ్రాయెల్ భూభాగంపై వాలాయని ప్రకటించిన ఇజ్రాయెల్ తాజా దాడులను ప్రారంభించింది.
ఇప్పటి వరకు ఇజ్రాయెల్- అమెరికా ఇరాన్‌పై సాగిస్తోన్న యుద్ధంలో 1300మంది ఇరాన్ పౌరులు, లెబనాన్‌లో 880 మంది, ఇజ్రాయెల్‌లో 12మంది చనిపోయినట్టు ఆయా దేశాలు వెల్లడించాయి.
13మంది అమెరికా సైనికులు చనిపోయారని మరో 200మంది గాయపడ్డారని అమెరికా సైనిక వర్గాలు వెల్లడించాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తాజా సంక్షోభం భారతదేశంలో గ్యాస్ సంక్షోభానికి తెరతీసింది.
ఇరాన్, ఇతర దేశాలతో సంప్రదింపులు జరుగుతున్నాయి: భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిది
హర్మూజ్ జలసంధిలో అనేక దేశాలకు చెందిన రవాణా నౌకలు దిగ్బంధనంలో ఉన్నాయని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
ఈ నేపథ్యంలో ఆయా దేశాలతో పాటు ఇరాన్‌తో కూడా భారత దేశం సంప్రదింపులు జరుపుతున్నట్టు జైస్వాల్ తెలియజేశారు.
“ఇరాన్, ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నాము. మా ప్రత్యేక కార్యదర్శి వివరించినట్టు హర్మూజ్ జలసంధి వద్ద అనేక దేశాలకు చెందిన రవాణా నౌకలు నిలిచిపోయి ఉన్నాయి. ఈ నౌకలు భద్రంగా గమ్యం చేరేలా ఇరాన్‌తోనూ ఇతర దేశాలతోనూ సమన్వయం చేసుకోవాలని మా ఉద్దేశం, మా లక్ష్యం. ఈ విషయంపై సంప్రదింపులు సాగుతున్నాయి. మానవతా పూర్వక సహాయం విషయానికి వస్తే ఇరాన్‌తో అనేక అంశాలపై చర్చిస్తున్నాము”అని జైస్వాల్ అన్నట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ఈ ప్రాంతంలో యుద్ధం నేపథ్యంలో సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయులకు అవసరమైన సేవలు అందించేందుకు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నెంబర్లను, ఇ-మెయిల్ వివరాలను ఎక్స్ వేదికగా విడుదల చేసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
