హెచ్ఐఎల్టీ విధానాన్ని నిలిపివేసి, విద్యుత్ ధరల పెంపును పునఃసమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వానికి పరిశ్రమల ఎస్ఓఎస్ కోరింది.
విద్యుత్ ఖర్చులు భారీగా పెరిగే అవకాశమున్న కొన్ని ప్రభుత్వ నిర్ణయాలను పునఃపరిశీలించాలని, వాటి వల్ల పరిశ్రమల కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయని తెలంగాణలోని ప్రముఖ పరిశ్రమ, వాణిజ్య సంఘాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి.
పునరుత్పాదక శక్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న పరిశ్రమలు, నో-ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు జారీ చేయడంలో జరుగుతున్న జాప్యం, ఇతర అడ్డంకుల వల్ల ఆగిపోయాయని ఆరోపించాయి.
రాత్రి సమయానికి ఇచ్చే టైమ్-ఆఫ్-డే(టీఓడీ) రాయితీని యూనిట్‌కు రూ 1.50గా మళ్లీ పునరుద్ధరించాలని, లేకపోతే చౌకైన సౌర విద్యుత్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో పగటి సమయ టారిఫ్‌పై అధిక రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
అలాగే లీడ్ kVArh బిల్లింగ్ అమలుకు సంబంధించి మరింత సమయం ఇవ్వాలని, అవగాహన కల్పించాలని, దశలవారీగా అమలు చేయాలని కోరాయి.
అంతేకాదు, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో భూమి వినియోగాన్ని నియంత్రించేందుకు తీసుకొచ్చిన వివాదాస్పద హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హెచ్ఐఎల్టీ) విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా ప్రభుత్వానికి విన్నవించాయి.
అరుదైన ఐక్యతను ప్రదర్శిస్తూ, ఎఫ్‌టీసీసీఐ, టీఐఎఫ్, టీఐఎస్ఎంఏ, టీఎస్టీఎంఏసహా 10కి పైగా పరిశ్రమల సంఘాలు—మొత్తం కలిపి 50,000కు పైగా పరిశ్రమ యూనిట్లను ప్రతినిధ్యం వహించే సంస్థలు తమ ఆందోళనలను వ్యక్తం చేశాయి.
పట్టణ ప్రణాళిక అవసరమే అయినప్పటికీ, పరిశ్రమలను నివాసాల మాదిరిగా ఒక చోట నుంచి మరో చోటికి తరలించడం సాధ్యం కాదని వారు స్పష్టం చేశాయి.
విద్యుత్ సమస్యలు
పరిశ్రమల ప్రతినిధులు అత్యంత తీవ్రమైన సమస్యగా పేర్కొన్నది— లీడ్ kVArh అన్బ్లాకింగ్ను అకస్మాత్తుగా అమలు చేయడం. దీని వల్ల వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఊహించని స్థాయిలో విద్యుత్ ఖర్చు పెరిగిందని తెలిపాయి.
లీడ్ kVArh అన్‌బ్లాక్ చేయడంతో, పరిశ్రమలు గ్రిడ్‌కు సరఫరా చేస్తున్న రీయాక్టివ్ పవర్‌కూ డిస్కంలు ఇప్పుడు చార్జీలు వసూలు చేస్తున్నాయి.
“ఈ అకస్మాత్తు మార్పు వల్ల అనేక పరిశ్రమల విద్యుత్ బిల్లులు మూడు నుంచి ఐదు రెట్లు వరకు పెరిగాయి, దీని ప్రభావం పరిశ్రమల కార్యకలాపాలపై, పోటీ సామర్థ్యంపై తీవ్రంగా పడుతోంది” అని తెలిపాయి.
ప్రస్తుత విధానంలో, గ్రిడ్ నుంచి రీయాక్టివ్ పవర్ తీసుకునే వినియోగదారులకే కాకుండా, గ్రిడ్‌కు రీయాక్టివ్ పవర్ అందించే వినియోగదారులకూ డిస్కంలు జరిమానాలు విధిస్తున్నాయని, ఇది రీయాక్టివ్ పవర్ నిర్వహణ అసలు లక్ష్యాన్నే నిర్వీర్యం చేస్తోందని విమర్శించాయి.
ఈ పరిస్థితిని సమగ్రంగా సమీక్షించేందుకు, పరిశ్రమల ప్రతినిధులు, ఐఐటీలు, జేఎన్టీయూలు వంటి ప్రముఖ సాంకేతిక సంస్థలు, డిస్కంలతో పాటు ఇతర వాటాదారులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
