ప్రపంచంలోని దాదాపు 80% దేశాలు తమకు కావల్సిన రుణాలు, గ్రాంట్లను చైనా నుంచి పొందుతున్నాయి. గమనించదగ్గ విషయం ఏంటంటే, ఇందులో అమెరికానే అత్యధికంగా లాభం పొందుతున్నది. అమెరికాలో ప్రాజెక్టుల కోసం సుమారు 200 బిలియన్ డాలర్ల రుణాన్ని చైనా బ్యాంకులు అందజేశాయి.
వర్జీనియాలోని విలియం, విలియంబర్గ్ మేరీ కళాశాలలకు చెందిన పరిశోధన సంస్థ ఎయిడ్ డేటా తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో చైనా రుణపరపతి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.
పేద దేశాలకు సహాయపడి అండగా నిలుస్తుందన్న పాత్ర నుంచి బీజింగ్ క్రమంగా దూరం జరుగుతూ- అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాణిజ్య అవసరాల కోసం రుణాలు ఇవ్వాలన్నదానిపై చైనా దృష్టిని సారిస్తుంది. అమెరికన్ కంపెనీల రుణ లావాదేవిల్లో చైనా 75% అప్పులు పూర్తిగా వాణిజ్యపరమైన కార్యకలాపాల కోసం ఇవ్వగా; అభివృద్ధి పనులకు కేవలం 7% అప్పుగా ఇచ్చిందని ఉదాహరణగా ఆ నివేదిక పేర్కొన్నది.
తగ్గుతోన్న రుణ శాతం..
ఆర్ధిక అనుకూలత లేని దేశాల మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మొదట్లో చైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా చైనా అధ్యక్షులు జిన్పింగ్ 2013లో బెల్ట్& రోడ్డు పథకాన్ని(బీఆర్ఐ) ప్రారంభించారు.
ఐరోపా, ఆసియా అనుసంధాన ప్రాజెక్టులు; ఇంధనం, మౌలికసదుపాయాల అభివృద్ధినుద్దేశించి బీఆర్ఐను చేపట్టారు. కానీ మారుతున్న ప్రపంచ ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఆ తర్వాత బీఆర్ఐ నుంచి చైనా వెనకడుగు వేసింది. బీఆర్ఐ ప్రాజెక్టుల కోసం ఒకప్పుడు 75% రుణాలు ఇవ్వగా వాటిని ఇప్పుడు 25శాతానికి తగ్గించేసింది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80% దేశాలకు 2000- 2003 మధ్యకాలంలో రుణాలు, గ్రాంట్ల రూపంలో రెండు ట్రిలియన్ డాలర్లకు పైగా రుణాన్ని చైనా అందించింది. అందులో అమెరికన్ కంపెనీలకు చెందిన 2,500 ప్రాజెక్టులు, ఇతర కార్యకాలాపాల కోసం సుమారు 200 బిలియన్ డాలర్ల రుణ సౌకర్యాన్ని చైనా కల్పించింది. ఈ మొత్తంలో నుంచి 95% రుణాలను చైనా సెంట్రల్ బ్యాంకు, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు- సంస్థలు ఇవ్వగా; మిగితావి ప్రైవేటు సంస్థల నుంచి తీసుకున్నవున్నాయి. అమెరికన్ కంపెనీలు తీసుకున్న అప్పుల నుంచి 75% అప్పును వాణిజ్య అవసరాలకు తీసుకోగా; కేవలం 7% రుణాలు అభివృద్ధి కోసం తీసున్నట్లు నివేదిక తెలిపింది.
ఏదో ఒక రూపంలో రుణం..
ప్రపంచంలో ఉన్న మొత్తం 217 దేశాలు, ప్రాంతాల నుంచి 179 దేశాలు లేదా ప్రాంతాలకు 2000- 2003 మధ్యకాలంలో ఏదో ఒక రుణాన్ని చైనా అందించింది. దీంతో పాటు వివిధ దేశాలకు ఇంత వరకు 140 బిలియన్ డాలర్ల రుణాలను ఇచ్చింది.
చైనా రుణాలు తీసుకుంటున్న దేశాలలో అమెరికా తర్వాత రష్యా, అస్ట్రేలియా ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉన్నాయి. గత రెండు దశాబ్దలకాలంలో ఈ రెండు దేశాలలో ఉన్న సంస్థలలో నుంచి రష్యన్ సంస్థలు 172 బిలియన్, ఆస్ట్రేలియా సంస్థలు 130 బిలియన్ డాలర్ల రుణాలను స్వీకరించాయి.
అలాగే ఐరోపా యూనియన్లో ఉన్న 27 సభ్య దేశాలలో ఉన్న సంస్థలు 1,800 ప్రాజెక్టులు, ఇతర కార్యకాపాల కోసం 161 బిలియన్ డాలర్ల రుణాన్ని తీసుకున్నాయి.
చైనా బ్యాంకుల నుంచి భారత దేశంలో ఉన్న సంస్థలు కూడా రుణాలు- గ్రాంట్ల రూపంలో 11.1 బిలియన్ డాలర్లను పొందాయని, ఎయిడ్ డెటా సంస్థ తెలిపింది.
2000 సంవత్సరంలో అమెరికాకు 320 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వగా; అది 2023 వచ్చేసరికి 19 బిలియన్ డాలర్లకు పెరిగింది. విదేశాలలో వీలీనాలు ,సేకరణ విషయంలో చైనా 80% విజయాన్ని సాధించింది.
చైనా పెట్టుబడి, రుణాలు పొందుతున్న దేశాలలో; విదేశీ రుణ స్వీకరణ యాంత్రాంగం బలహీనంగా ఉండటం కూడా ఒక కారణం. అనేక షెల్ కంపెనీల ద్వారా, అంతర్జాతీయ బ్యాంకు సిండికెట్ల సహయంతో చైనా ఈ 80% విజయాన్ని సాధించిందని నివేదిక వివరించింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
