రెండు వేర్వేరు బ్యాంకు మోసాల కేసుల్లో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్‌లతో పాటు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీతో సహా; వాటి మాజీ డైరెక్టర్లపై సీబీఐ కేసులు నమోదు చేసి, వారి నివాసాలలో సోదాలను నిర్వహించింది.
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) డిసెంబర్ 9న రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్‌లతో పాటు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీతో సహా; వాటి మాజీ డైరెక్టర్లపై రెండు వేర్వేరు బ్యాంకు మోసాల కేసుల్లో కేసులు నమోదు చేసి, వారి నివాసాలలో సోదాలను నిర్వహించింది.
ఒక పత్రికా ప్రకటన ప్రకారం, ముంబైలోని రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ రెండు ప్రదేశాలలో; అలానే దాని మాజీ డైరెక్టర్ జై అన్మోల్, మాజీ సీఈఓ రవీంద్ర సుధాకర్ నివాసాలలో సోదాలు చేసింది. సోదాలలో “అనేక నేరారోపణ పత్రాలు” లభించాయి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు ఆధారంగా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై కేసు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. ఆ కంపెనీ తమకు రూ 228.06 కోట్ల అనవసర నష్టాన్ని కలిగించిందని బ్యాంక్ ఆరోపించింది. ఆ కంపెనీ, దాని ప్రమోటర్లు/డైరెక్టర్లు, గుర్తు తెలియని బ్యాంకు అధికారులపై నేరపూరిత కుట్ర- మోసం, నేరపూరిత దుష్ప్రవర్తన కింద అభియోగాలను ఏజెన్సీ మోపింది.
ది హిందూలో వచ్చిన నివేదిక ప్రకారం, 2019 సెప్టెంబర్‌లో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ రుణ ఖాతాను నిరర్థక ఆస్తి(ఎన్పీఏ)గా బ్యాంక్ ప్రకటించిన తర్వాత; ఫోరెన్సిక్ దర్యాప్తులో “అరువుగా తీసుకున్న నిధుల క్రమబద్ధమైన దుర్వినియోగం/మళ్లింపు” జరిగిందని తేలింది. దీని తర్వాత బ్యాంక్ 2024 అక్టోబర్‌లో రుణ ఖాతాను మోసపూరితమైనదిగా ప్రకటించింది.
రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ విషయంలో తమ కంపెనీకి రూ 57.47 కోట్ల నష్టాన్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కలిగించిందని ఆరోపించింది.
సీబీఐ ప్రకటన ప్రకారం, కంపెనీపై నేరపూరిత కుట్ర, మోసం- నేరపూరిత దుష్ప్రవర్తన అభియోగాలు కూడా దాఖలు చేయబడ్డాయి. దాని రుణ ఖాతాను మార్చి 2020లో ఎన్పీఏగా ప్రకటించారు. 2025 అక్టోబర్ 4న మోసపూరితంగా ప్రకటించారు. సోదాల సమయంలో నేరారోపణ పత్రాలు కూడా కనుగొనబడ్డాయి.
రుణ పరిష్కార ప్రక్రియలో భాగంగా 2022-23లో రెండు కంపెనీలను ఆటమ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుగోలు చేసింది.
ఇంతలో, దివాలా తీసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు దాఖలు చేసిన దాఖలులో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన- దాని అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికాం రుణ ఖాతాలను ఈ నెల ప్రారంభంలో ‘మోసపూరితమైనవి’గా ప్రకటించిందని తెలిపింది.
ఈ కేసులు భారతదేశంలోని అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ తమ్ముడు, ఒకప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సన్నిహితుడిగా పరిగణించబడే అనిల్ అంబానీకి మరో పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
