కారకాస్, వెనిజులా: శనివారం వేకువ జామున అమెరికా భారీ ఎత్తున సాయుధదాడికి దిగింది. దేశ అధ్యక్షుడు నికోలోస్ మదురోను బంధించామని, ప్రవాసానికి తరలించామని అమెరికా ప్రకటించింది. కొన్ని నెలలుగా వెనిజులాపై రకరకాల ఒత్తిళ్లకు పాల్పడిన తర్వాత, చిట్టచివరకు అర్ధరాత్రి ఆకస్మికదాడికి పాల్పడినట్టు స్వయంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ధ్వంసమైన రాజధాని కారకాస్ నగరంపై వాయిసేనల కదలికలు, పలుచోట్ల బాంబు పేలుడు శబ్దాలు వినబడ్డాయి. వెనిజులాకు చెందిన పౌరవాసాలపైన, సైనిక కేంద్రాలపైన అమెరికా దాడి చేసిందని మదురో ప్రభుత్వం ఆరోపించింది. “అమెరికా చర్య సామ్రాజ్యవాద దాడి”అని వెనిజులా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా దుందుడుకుతనానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలకు దిగాలని పిలుపునిచ్చింది.
ఈ వార్త రాసే సమయానికి వెనిజులా పరిపాలన ఎవరి చేతుల్లో ఉందో స్పష్టంగా తెలియలేదు. ఆ దేశ అధ్యక్షుడు మదురో ఎక్కడ ఉన్నారో కూడా తెలియలేదు.
వెనిజులా రాజ్యాంగం ప్రకారం, అధ్యక్షుడు లేనప్పుడు ఉపాధ్యక్షుడు డిక్లై రోడ్రీగుయేజ్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించవచ్చు. అయితే దీనికి సంబంధించిన ధృవీకరణలేనప్పటికీ దాడి జరిగిన తర్వాత డిక్లై ఓ ప్రకటనను విడుదల చేశారు. “మనిషి బతికే ఉన్నాడని సాక్ష్యం కావాలి” అంటూ ప్రభుత్వ టెలివిజన్ ఛానల్లో ప్రకటించారు.
“భార్య పిల్లలతో సహా మదురోను బంధించి ప్రవాసానికి పంపాము. అమెరికా న్యాయభాగంతో సమన్వయం చేసుకుని దాడి చేశాము. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాము” అని ట్రూత్ సోషల్, ట్విట్టర్ హ్యాండిల్లో ట్రంప్ శనివారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో వెల్లడించారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం పత్రిక గోష్టి నిర్వహించారు. అమెరికా చట్టం ప్రకారం ఈ దాడి పర్యవసానాలు ఏమిటో స్పష్టంగా తెలియరాలేదు.
మదురోనూ, అతని భార్యను ఎక్కడ తీసుకెళ్లారనే ప్రశ్నలకు అమెరికా స్పందించలేదు. అమెరికా న్యాయశాఖ మదురోపై విచారణ చేపట్టనుందానే ప్రశ్నకు కూడా స్పష్టమైన సమాధానం లేదు.
2020లో మదురో మాదకద్రవ్యాలు ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని న్యూఇయర్ దక్షిణ జిల్లా న్యాయస్థానం నిర్ధారించింది. చివరిసారిగా మదురో శుక్రవారం నాడు దేశ రాజధాని కారకాస్‌లో చైనా ప్రతినిధి బృందాన్ని కలిసినట్టుగా కనిపించారు.
2026 సంవత్సరం ప్రవేశించిన మూడో రోజున దేశ రాజధాని కారకాస్‌లో కనీసం 7 చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో వీధుల్లోకి వచ్చారు. మరి కొంతమంది సోషల్ మీడియా ద్వారా బాంబు పేలుళ్లను ప్రసారం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ పేలుళ్ల కారణంగా ప్రాణనష్టం జరిగిందా లేదా అన్నది వెంటనే తెలియలేదు. దాడులు విజయవంతంగా జరిగాయని ట్రంప్ ప్రకటించినప్పటికీ రానున్న రోజులలో మరికొన్ని దాడులు జరుగుతాయా లేదా అన్నది స్పష్టంగా తెలియలేదు.
బాంబు పేలుళ్లు జరగడానికి ముందే అమెరికా విమానాలు గగనతలంలోని ప్రవేశించకూడదని అమెరికా పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది.
అమెరికాపై మాదకద్రవ్యాలతో ఉగ్రవాదానికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై వెనిజులా అధ్యక్షుడు మదురోను శిక్షించాలని అమెరికా నిర్ణయించింది. అప్పటి నుంచి ఆ దేశంపై అనేకరకాలుగా ఒత్తిడి తెచ్చింది.
గతవారం, వెనిజులాకు చెందిన మాదకద్రవ్య వ్యాపారులు ఉపయోగిస్తున్నారన్న సాకుతో డ్రోన్ల మీద సీఐఏ నాయకత్వంలో దాడి జరిగింది. సెప్టెంబర్‌లో వెనిజులాపై దాడులు మొదలుపెట్టిన తర్వాత వెనిజులా గడ్డపై ప్రత్యక్షంగా దాడికి దిగటం ఇదే మొదటిసారి.
మాదకద్రవ్యాలు చేరవేస్తున్నారనే ఆరోపణలపై సముద్ర జలాల్లో వెనిజులాకు చెందిన అనేక పడవలపై దాడి చేసిన అమెరికా– త్వరలోనే వెనిజులా భూభాగంపై కూడా దాడి చేయనున్నట్టు గతంలో ట్రంప్ ప్రకటించారు. తనను అధ్యక్షుడు పదవి నుంచి దించడానికి అమెరికా ఈ చర్యలకు పాల్పడుతుందంటూ మదురో విమర్శించారు.
వీధుల్లోకి జనం
వెనిజులా పాలక పార్టీకి పెట్టని కోటగా భావించే కారకాస్ నగరంలోని కొన్ని ప్రాంతాలలో సైనిక అధికారులు ప్రజా సైన్యం వీధుల్లోకి వచ్చింది. అయితే నగరంలోని మిగతా ప్రాంతంలో, దాడుల తర్వాత చాలా వరకు వీధులు నిర్మానుష్యంగా మారాయి.
నగరంలో చాలా ప్రదేశాలు చీకట్లో కమ్ముకున్నప్పటికీ వాహన రాకపోకలకు అంతరాయం కలగలేదు.
కారకాస్, మరో కోస్తా నగరం నుంచి సేకరించిన వీడియోల ద్వారా ఆయా ప్రాంతాలలో బాంబు పేలుళ్లు అనంతరం ఆకాశం అంతా దట్టని పొగతో నిండిపోయిందని తెలిసింది. మరో వీడియోలో ప్రధాన రహదారిపై వాహనాలు వెళ్తుండగా వాటి వెనుక ఉన్న పర్వత ప్రాంతాలలో పేలుళ్లు జరిగినట్టు తెలుస్తోంది. మరికొందరు మాట్లాడుతున్న విషయాలు కూడా ప్రసారమయ్యాయి. ఈ వీడియోలను డీ అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ ధ్రువీకరించింది.
కారకాస్‌లోని సైనిక కేంద్రాల నుంచి పొగలు కనిపించగా, నగరంలోని మిగిలిన సైనిక స్థావరాలలో చీకట్లు కమ్ముకున్నాయి. అయితే ప్రభుత్వం తక్షణమే సోషల్ మీడియాలో స్పందించలేదు.
ప్రజల ప్రత్యక్ష చర్యలకు దిగాలని పిలుపు ఇవ్వడం ద్వారా అమెరికా దాడులపై వెనిజులా స్పందించింది. “ఈ సామ్రాజ్యవాద దాడిని తిప్పికొట్టేందుకు ప్రజలు వీధుల్లోకి రావాలని” పిలుపునిచ్చింది.
దేశాన్ని ఆస్థిరపరచడానికి విదేశీ సభ్యులు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపిస్తూ– జాతీయ సంరక్షణకై రూపొందించిన అన్ని పథకాలను అమలుపరచాలని మదురో ఆదేశించినట్టు ఈ ప్రకటన తెలిపింది. దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తే– ప్రభుత్వం పౌర హక్కులను రద్దుచేసి సైనిక చర్యలకు దిగేందుకు అధికారాలను కల్పిస్తుంది.
“భూమి బాగా కనిపించింది. ఆకాశంలో విమానాలు కనపడ్డాయి‘‘ 20 ఏళ్ళ కామన్ హెడల్పు కొడుకు చెప్పారు. ఇద్దరు బంధువులతో జన్మదిన కార్యక్రమానికి కి వెళ్లి వస్తున్న ఆమె తమను గాలి నెట్టేస్తుందని అనిపించినట్టుగా తెలిపింది.
ఆ సమయంలో ట్రంప్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని ప్రైవేట్ క్లబ్లో ఉన్నారు. రెండు వారాల క్రితం వేసవి సెలవులను గడపటానికి ట్రంప్ ఫ్లోరిడా వెళ్లారు. శుక్రవారం సాయంత్రం ట్రంప్‌కు దాడి కంటే ముందే నిఘా వర్గాల బోగట్ట చేరినట్టుగా తెలుస్తుంది.
అనువాదం: కొండూరు వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
