పెట్రాస్ మృతికి ఎదురైన అణచివేత స్పందన మన కాలంలో క్రమంగా మేధో సంపత్తి సంకుచితత్వాన్ని తెలియజేస్తుంది.
జేమ్స్ పెట్రాస్ మృతి- ఎవరి రచనలైతే ఖండాంతరాల వ్యాప్తంగా తార్కిక ఆలోచనాపరుల తరాలను ప్రభావితం చేశాయో ఆ అమెరికన్ సోషియాలజిస్టు- దాదాపు గుసగుసలాడుతున్న ప్రపంచం మీదుగా వెళ్లిపోయారు.
అధికార హింసను బట్టబయలు చేస్తూ తన జీవితాన్ని గడిపిన ఒక మేధావి; గ్లోబల్ పెట్టుబడిదారీ వర్గం అసమానతలు, సామ్రాజ్యవాద భ్రమల నుంచి కొంతమంది చదువరులు, సహచరుల నివాళిని దాటి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లారు.
అపారమైన మేధస్సును ప్రకాశంతో కొలుస్తున్న ప్రస్తుత సమయంలో ఆయన మరణం చుట్టూ నెలకొన్న నిశ్శబ్దం సమకాలీన ప్రజా జీవితంలో భిన్నాభిప్రాయాల గొంతుకలకు కేటాయించిన చేసిన స్థానం గురించి తెలియజేస్తుంది.
తన 89వ జన్మదినం రోజున సీటెల్‌లో 2026 జనవరి 17న పెట్రాస్ చనిపోయారు.
అమెరికన్ రాజకీయాల్లో మరో ప్రముఖ రాడికల్(తీవ్రవాద) గొంతుక అనుకున్న మైఖేల్ పారెంటి మరణానికి కేవలం కొద్ది రోజుల ముందు ఆయన వెళ్లిపోయారు.

అయితే పారెంటి పేరును విస్తారంగా ప్రచారం చేయగా- ఎవరూ గుర్తుపట్టనట్టుగా విద్యావేత్తలు, మీడియా వర్గాల మౌనం మీదుగా పెట్రాస్ అంతిమ ప్రయాణం కొనసాగింది.
విద్యాభ్యాసం, బోధనా ప్రస్థానం..
మసాచుసెట్స్‌లో వలసదారుల కార్మిక వర్గ కుటుంబంలో 1937లో పెట్రాస్ జన్మించారు. పెట్రాస్ తన స్కాలర్షిప్ను గాఢమైన కార్మికుల పోరాటాలు, సామాజిక అన్యాయాల సున్నితత్వంతో తీసుకు వెళ్లేవారు.
బోస్టన్ కాలిఫోర్నియా, బర్కిలీ విశ్వవిద్యాలయాల్లో చదువు పూర్తి చేసిన తర్వాత ఎక్కువ కాలం పాటు తన ఉద్యోగాన్ని బింగ్హామ్టన్ విశ్వవిద్యాలయంలో కొనసాగిస్తూ అక్కడ సోషియాలజీ పాఠాలు చెబుతూ విద్యార్థులను తీర్చిదిద్దారు.
ఆ తర్వాత వాళ్లు విద్యార్థులు, పండితులు, కార్యకర్తలు, మేధావులుగా మారారు.
సుమారు 60 పుస్తకాలు, వందల సంఖ్యలో విద్యాపరమైన కథనాలు, వార్తా పత్రికల్లో వేలల్లో వ్యాసాలు, ప్రపంచవ్యాప్తంగా జర్నల్స్‌తో దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా మేధోపరమైన పనిని అసాధారణంగా తను సృష్టించారు.
తన తరానికి చెందిన కొంత మంది పండితులు మాత్రమే అంత పట్టుదలతో ప్రపంచం మొత్తానికి చేరే విధంగా రాశారు.
ట్రంప్ పరిపాలన నుంచి ప్రతీకార చర్యలకు భయపడుతున్న నేపథ్యంలో బింగ్హామ్టన్ విశ్వవిద్యాలయం కనీసం ఆయనకు సంతాపాన్ని తెలియజేసినా ఆశ్చర్యపోవాల్సిందే.
పెట్రాస్తో వ్యక్తిగత అనుబంధం..
పెట్రాస్తో నాకు దాదాపు పాతికేళ్ల సంబంధం ఉంది. మూడు జర్నల్స్‌లో ఆయన కథనాలు ప్రచురించబడ్డాయి వాటిని నేను సవరించాను.
ది సౌత్ ఏషియన్ జర్నల్ ఆఫ్ డిప్లొమసీ, ది ఇండియన్ జర్నల్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్; జర్నల్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ ఫిస్కల్ ఫెడరలిజం.
ఈ జర్నల్స్‌లోని రెండింటికి అంతర్జాతీయ సలహా బోర్డులో కూడా ఆయన సేవలందించారు. మా మధ్య ఆప్యాయత, మేధోపరమైన అనుబంధం తీవ్రంగా ఉండేది.
ఆయన 2020 ఏప్రిల్ వరకు మెయిల్స్ పంపిస్తూ గ్లోబల్ సౌత్‌లో పరిణామాల గురించి అడుగుతూ తాజా రాజకీయాలపై తన సూచనలు ఇచ్చేవారు.
చివరిసారి ఆయన పంపించిన మెయిల్లో నేను సవరించాలని ఆలోచించిన సంపుటితో పాటు పోస్టు మార్క్సిజంపై తన వ్యాసాలను పంపించాలని కోరారు. ఆ తర్వాత నిశ్శబ్దం నెలకొంది.
నాకు ఆయన మరణ వార్త ఆలస్యంగా చేరగానే, ఒక సన్నిహిత పండితుడు వెళ్లిపోయాడనిపించింది. కొనసాగుతున్న సంభాషణ ఆకస్మాత్తుగా ఆగిపోయినట్టు అనిపించింది.
పెట్రాస్ జీవితం స్కాలర్షిప్ ఎంగేజ్మెంట్ అరుదైన కలయిక. విద్యా పనిని ఒంటరి వృత్తిగా ఆయన ఏనాడు చూడలేదు. సామాజిక ఉద్యమాలకు సహకరించేవారు.
లాటిన్ అమెరికాలో అణచివేతను పరిశీలించే అంతర్జాతీయ ట్రిబ్యూనల్‌లో పాల్గొన్నారు. సామూహిక వార్తా పత్రికలు, పండిత జర్నల్స్ కోసం ఆయన రాశారు.
సమాజం పట్ల మేధావుల పని బాధ్యతను మోపుతుందని ఆయన నమ్మేవారు. తన జీవితాంతం ఆ నమ్మకాన్ని ఆచరణలో పెట్టారు.
విశ్వవిద్యాలయాలు సాంకేతిక ప్రత్యేకతల బహుమతులు, సురక్షితమైన ముగింపుల కాలంలో, అత్యవసర రాజకీయ వాస్తవాలతో స్కాలర్షిప్ ఇంకా మాట్లాడవచ్చనే సందేశంతో పెట్రాస్ బలంగా నిలబడ్డారు.
పద్ధతి, అధికారం, సామ్రాజ్యవాద ప్రశ్న..
పటిష్టవంతమైన రాజకీయ పోరాటాలు, రాజ్యాధికారం, వర్గ సంబంధాల ద్వారా గ్లోబల్ అసమానతలను అధ్యయనం చేయాలనేది పెట్రాస్ మేధో ప్రపంచం తరచుగా గుర్తు చేస్తుంది.
గ్లోబలైజేషన్‌పై అనేక మంది సిద్ధాంతకర్తలు మార్కెట్ల ప్రభావం, అనుసంధానం, అంతర్జాతీయ సంస్థల ప్రపంచంగా వర్ణిస్తున్నారు.
ఈ క్రమాన్ని పెట్రాస్ వేరుగా చూశారు. కార్పొరేట్ ఆసక్తిని రక్షించడానికి బలమైన దేశాలు గ్లోబల్ పెట్టుబడి, ఆర్థిక నిబంధనల అమలు, సైనికశక్తి దింపడాన్ని కొనసాగిస్తున్నాయని ఆయన వాదిస్తారు. ఆయన దృష్టిలో, సామ్రాజ్యవాదం రద్దు కాలేదు. కానీ తన రాజకీయ పునాదులను కాపాడుకుంటూ కొత్త ఆర్థిక రూపాలను అలవర్చుకుంటుంది.
ఈ వాదనతో ఆయనకు ఇమ్మాన్యుయేల్ వాలర్స్టీన్, సమీర్ అమీన్ వంటి ప్రపంచ పద్ధతుల ఆలోచనాపరులతో సంభాషించడానికి అవకాశం కల్పించింది. కాగా మూలానికి అంచుకు మధ్య దీర్ఘకాల చారిత్రక సైకిల్స్, నిర్మాణాత్మకమైన వారసత్వాల గురించి వారు పరిశీలించారు. ప్రతి సమాజం లోపల సామాజిక సంబంధాలపై పెట్రాస్ తన దృష్టిని మార్చారు.
ఉత్పత్తి స్థలంలోనే దోపిడి మొదలవుతుంది, దాన్ని దేశీయ పాలక వర్గాలు అంతర్జాతీయంగా అధికారాన్ని విస్తరించడానికి రాజ్యాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారని ఆయన వాదించారు. కాబట్టి జాతి-రాష్ట్రం వాడుకలో లేని విధంగా కాకుండా కేంద్ర బిందువుగా ఉంటుంది.
వర్గ ఘర్షణ లేదా ఏజెన్సీలపై ఇది నొక్కిచెబుతూ పెట్రాస్ పరిశోధనకు తక్షణ రాజకీయ గ్రహణశక్తిని ఇచ్చింది.
లాటిన్ అమెరికా అధ్యయనాలు – రాజకీయ విశ్లేషణ
విశ్లేషణల కోసం తనకు ముఖ్య లాబొరేటరీగా లాటిన్ అమెరికా సేవలందించింది. నియో లిబరల్ సంస్కరణలు, వ్యాపార ఒప్పందాలు, ఆర్థికంగా ఆధారపడటంపై పెట్రాస్ విస్తృతంగా రాశారు. జాతీయ సార్వభౌమత్యాన్ని, కార్మిక ఉద్యమాలను బలహీనపరుస్తూ ఈ ప్రక్రియ ద్వారా సంపదను ఎలా బదిలీ చేస్తారనేది చూపించారు.
సాల్వడార్ అలెండే, హ్యూగో ఛావేజ్, ఆండ్రియాస్ పాపాండ్రూ వంటి ప్రముఖులతో ఆయన సన్నిహిత సంబంధాలను కొనసాగించారు.
గ్లోబల్ పరిమితులకు వ్యతిరేకంగా సంస్కరణల ప్రభుత్వాలు ఎలా పోరాడుతాయో తనకు తాను పరిశీలించుకున్నారు.
ప్రజా ఉద్యమాలకు మద్దతునిస్తూ, అధికార ధోరణులు లేదా రాజీ పడే విమర్శలు ఆయనను ఏనాడు నిరోధించలేదు.
సంఘీభావం, సందేహించే వైఖరిని సంతులనం చేయడమే ఆయన పద్ధతికి ముఖ్య లక్షణాలు అయ్యాయి.
సమకాలీన సిద్ధాంతంపై ఆయన విమర్శలు కూడా ఈ ధోరణిని ప్రతిబింబిస్తాయి.
పోస్ట్-మార్క్సిజం తర్వాత ఆయన రచనల్లో- మేధో పురోగతి కంటే కూడా రాజకీయ ఓటములను ప్రతిబింబించే వర్గ రాజకీయాలకు ఇది తిరోగమనమని పెట్రాస్ వాదించారు.
ఆర్థిక నియంత్రణ, కార్మికులు, యజమాన్యం ప్రశ్నలతో కలిపినప్పుడే గుర్తింపు ఆధారిత పోరాటాలు పరివర్తనను సాధించవచ్చని ఆయన విశ్వసించారు.
సరిహద్దురహిత అనుసంధానాలుగా అధికారం చెదిరిపోయిందన్న హార్డ్ట్, నెగ్రిల ఆలోచనను, సామ్రాజ్యవాదంపై ఆయన విమర్శలను తిరస్కరించారు.
గుత్తపెట్టుబడిదారీ కార్పొరేషన్లు ఇంకా బలమైన రాష్ట్రాలపై ఆధారపడి ఉన్నాయి- పెట్రాస్కు మాత్రం ఆధిపత్యానికి సైనిక కలయిక నిర్ణయాత్మక పనిముట్లుగా ఉన్నాయి.
సామాజిక శాస్త్రాలను కనుమరుగైన అంశాలుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన హెచ్చరించారు. ఆధునిక సమాజాలపై ప్రభావం చూపుతున్న శక్తుల గురించి అర్థం చేసుకోవాలంటే రాజకీయ ఆర్థికం, సోషియాలజీ, చరిత్రను కచ్చితంగా తిరిగి కలిపి చిత్తశుద్ధితో వివిధ అంశాలను చేపట్టాలని ఆయన వాదించారు.
తన దృష్టిలో కేవలం సామాజిక ధోరణులను వివరించడానికి మాత్రమే కాకుండా అధికారం ఎలా పనిచేస్తుందో అనేది కూడా స్కాలర్షిప్ వివరించాలన్నారు.
ట్రంప్ గత సంవత్సరాల మొదట్లో జాతీయవాదం, ఆర్థిక విధానాల పెరుగుదల, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ వ్యూహం, అమెరికా విదేశాంగ విధానం ఈ విశ్లేషణకు మార్గదర్శకమయ్యాయి.
దేశీయ రాజకీయాలు చర్చిస్తున్నప్పుడు కూడా అంతర్గత అసమానతలు, గ్లోబల్ సామ్రాజ్యవాదం భవిష్యత్తు అంచనాలకు సంబంధాలను పెట్రాస్ కనుగొన్నారు.
వారసత్వంగా మేధో ధైర్యం
దశాబ్దాల తరబడి ఖండాంతరాల వ్యాప్తంగా ఎక్కువగా రాయడం జేమ్స్ పెట్రాస్ సొంతం. 21వ శతాబ్దంలో సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ వర్గం, సిస్టమ్ ఇన్ క్రైసిస్, బియాండ్ నియోలిబరలిజం, అన్మాస్కింగ్ గ్లోబలైజేషన్ వంటి పుస్తకాలు గ్లోబల్ పెట్టుబడిదారీ విధానం పుట్టుక, అది రెచ్చగొట్టే ప్రతిఘటనలను తెలియజేస్తున్నాయి.
లాటిన్ అమెరికాపై తన అధ్యయనాలను తరచుగా హెన్రీ వెల్ట్మేయర్తో కలిసి రాసిన రచనలు సామాజిక ఉద్యమాలకు, అభివృద్ధి కోరుకునే పండితులకు అత్యవసర ప్రస్తావనలుగా మిగిలిపోయాయి.
అదే సమయంలో అంతర్జాతీయ వార్తాపత్రికల్లో, జర్నల్స్‌లో ఆయన కథనాలు, ఆయన ఆలోచనలు విద్యావేత్తలను దాటి సాధారణ పాఠకులకు చేరాయి.
పెట్రాస్ వారసత్వాన్ని ఆయన మేధస్సు, నిబద్ధత, స్థిరత్వం వేరు చేస్తుంది. చరిత్ర నుంచి వర్గ ఘర్షణలు వెలసిపోయాయని లేదా తటస్థ గ్లోబలైజేషన్‌కు సామ్రాజ్య రాజకీయాలు మార్గం ఇచ్చాయన్న దావాను ఆయన ఎప్పటికీ అంగీకరించలేదు.
సొంత ప్రభుత్వాల చర్యలను పరిశీలించాల్సిన బాధ్యత మేధావులపై ఉందని కూడా నొక్కి చెప్పారు. బలహీన దేశాలపై దూరం నుంచి తీర్పు చెప్పడానికి బదులుగా బలమైన తమ సొంత దేశాల్లోని ప్రభుత్వాల చర్యలను పండితులు పరిశీలించాలని; క్యూబా, పశ్చిమాసియా, గ్లోబల్ వ్యాపారంపై తన రచనల్లో కోరారు.
ఇది తన ప్రజా గొంతుక నిర్వచనానికి మేధావుల జవాబుదారీతనాన్ని నొక్కి చెబుతుంది.
ఆయన వృత్తి వివాదాలకు అతీతమేమీ కాదు. తర్వాత ఆయన కొన్ని రచనలు తీవ్ర విమర్శలను రెచ్చగొట్టాయి. ముఖ్యంగా తన విశ్లేషణలు సున్నితమైన రాజకీయ ప్రశ్నలను ప్రస్తావించినప్పుడు.
అయితే ఈ చర్చా గోష్టులు బయట పెట్టే విద్యా సంబంధమైన స్వాతంత్ర్యం, రాజకీయ అధికారం, ప్రజాప్రవచనాలకు మధ్య ఉన్న అశాంతి సంబంధాలు, ఉద్రిక్తతలను బట్టబయలు కావాలన్నదే ఆయన కోరారు.
సౌకర్యవంతమైన ఏకాభిప్రాయాన్ని పెట్రాస్ ఏనాడు లక్ష్యంగా పెట్టుకోలేదు. మేధో జీవితానికి వాదనలు అత్యంత విలువైనదిగా ఆయన చూశారు, భిన్నాభిప్రాయం ఏకాంతాన్ని ఆహ్వానిస్తుందని అంగీకరించాలి.
సుమారు ఐదు దశాబ్దాలు, సామాజిక పోరాటాల్లో విశ్లేషణ తత్వాన్ని కోల్పోకుండా స్కాలర్షిప్ అలాగే ఉంది. లాటిన్ అమెరికాలో ఉద్యమాలతో కలిసి నడవాలని గ్రీస్‌లో పాపాండ్రూ సలహా ఇచ్చారు, ఆలోచనకు కార్యాచరణకు మధ్య సంబంధాన్ని పెట్రాస్ అసాధారణంగా కొనసాగించారు.
వారిని ప్రతిఘటించే గొంతుకల పట్ల విశాలంగా ఉంటూ మేధోపరమైన పనులు అధికార నిర్మాణాలను విశదీకరించాలని ఆయన విశ్వసించారు.
మన కాలపు మేధో సంకుచితత్వం
పెట్రాస్ మరణానికి ఎదురైన స్తబ్దతతో కూడిన స్పందన మేధో ప్రపంచంలో ఏం దొరుకుతుందో తెలియజేస్తుంది. మన సమయంలో మేధో స్థానం సంకుచితత్వాన్ని స్పష్టంగా బహిర్గతం చేసింది.
విశ్వవిద్యాలయాలు వినూత్నాన్ని ఉత్సవం జరుపుకోగా భిన్నాభిప్రాయాన్ని మాత్రం ప్రోత్సహించడం లేదు. నిర్మాణాత్మక విమర్శలను కొట్టి పారేస్తూ సాంకేతిక విషయాలకు జర్నల్స్ రివార్డులను అందజేస్తున్నాయి. ప్రజా చర్చాగోష్టులు సౌకర్యవంతంగా లేని వాస్తవాల కంటే కూడా ఎక్కువగా రాజకీయ వ్యాఖ్యలనే ఇష్టపడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో అసమానతలు, సామ్రాజ్యవాదం, దోపిడి గురించి ఇంకా వివరణలు వెతుకుతున్నవారు పెట్రాస్ వంటి గొంతుకలను గుర్తుంచుకుంటారు.
సురక్షితమైన ముగింపులను ఖచ్చితంగా తిరస్కరిస్తూ సాధారణ అనుసంధానాలలో, ఉద్యమాలలో, తరగతి గదుల వ్యాప్తంగా ఆయన రచనలు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. సజీవ వాస్తవాలను ఈ సిద్ధాంతం ఎదుర్కోవాలని అవి నొక్కి చెబుతున్నాయి.
సాంకేతిక భాష వృత్తిపరమైన హెచ్చరికల వైపు స్కాలర్షిప్ తిరోగమనం చెందితే; అది తన ఉద్దేశాన్ని కోల్పోతుంది.
విద్యాసంబంధమైన దాన్ని కీర్తి అలంకారానికి కాకుండా చారిత్రక మార్పు కోసం ఆలోచనలను వస్తువులుగా చూడాలనే తరానికి ఖచ్చితంగా పెట్రాస్ చెందిన వారు. ఆయన మరణ వార్తను ప్రపంచం రేఖామాత్రపు స్పందనతో తెలుసుకుంటే, ఆయన లేవనెత్తిన ప్రశ్నలు అరుదుగా వెలసిపోతాయి.
కెఎం సీధి- ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అండ్ అకాడమిక్ అడ్వైజర్ టూ ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ స్టడీస్ ఎట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ(ఎంజియు), కేరళ. ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలో, సీనియర్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ డీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌గా కూడా పని చేశారు.
అనువాదం: గంట రాజు,సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
