2020- 21లో రూ 2.5 ట్రిలియన్గా ఉన్న కార్పొరేట్ల లాభం 2024-25లో రూ 7.1ట్రిలియన్కు చేరుకొని గణనీయంగా పెరిగిందని రిజర్వు బ్యాంక్ బులిటెన్ తెలియజేసింది.
న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక పలు కీలకమైన విషయాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం, దేశంలో సంవత్సర కాలంలో కార్పొరేట్ పన్నులను వ్యక్తిగత ఆదాయపు పన్నులు మించిపోయాయి. వేతనాల్లో స్తబ్ధత, లేఆఫ్‌లు వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ భారతీయ కంపెనీల లాభాలలో అసాధారణమైన మార్పు సంభవించింది. 2020- 21 నుంచి 2025 మధ్య కాలంలో లాభాలు మూడింతలు పెరిగినట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొన్నది.
తన అక్టోబరు బులిటెన్‌లో రిజర్వు బ్యాంక్ పొందుపర్చిన విశ్లేషణ ప్రకారం, కోవిడ్ మహమ్మారి సమయంలో అమ్మకాలలో హెచ్చుతగ్గులు వచ్చాయి. అయినప్పటికీ వస్తువుల ధరలు తగ్గడం వల్ల ముడి సరుకుల ధరలు కనిష్టానికి చేరుకున్నాయి. వేతన వృద్ధిని లోంగతీసుకోవడంలాంటి అనుకూల మౌలిక ప్రభావం వల్ల కార్పొరేట్ల నికర లాభం మొత్తం స్థాయి 115.6%నికి పెరిగింది.
కొవిడ్ కంటే ముందున్నలాభాలను అధిగమించడానికి ఈ నికర లాభాల స్థాయి దోహదపడింది.
మోతీలాల్ ఓస్వాల్ తెలియజేసిన ప్రకారం, 2025లో నిఫ్టీ- 500 యూనివర్స్‌లో కార్పొరేట్ లాభం జీడీపీ నిష్పత్తి యాధావిధిగా 4.7% కొనసాగింది– ఇది 17 ఏళ్ల గరిష్టం. గమనించాల్సిన విషయమేంటంటే, ఇండియా ఇంక్ 14 ఏళ్ల గరిష్ట నిష్సత్తి 5.1% కొనసాగింది. గడిచిన మూడు నెలలలో భారత జీడీపీ వృద్ధి మందగించి 2024- 2025లో 6.5 శాతానికి పడిపోయింది- కోవిడ్ కాలం నుంచి ఇది చాలా తక్కువని చెప్పుకొవాలి.
జేఎం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీస్ ఇటీవల విడుదల చేసిన నివేదికను ఎకనామిక్ టైమ్స్ ఉదహరించింది. దీని ప్రకారం, మొత్తం ప్రత్యక్ష పన్నుల వాటాలో వ్యక్తిగత ఆదాయపు పన్ను 2014 ఆర్ధిక సంవత్సరంలో 38.1% నుంచి 2024 ఆర్ధిక సంవత్సరం నాటికి 53.4%నికి పెరిగింది. అదే సమయంలో కార్పొరేట్ పన్నులు 61.9% నుంచి 46.6 శాతానికి తగ్గాయి.
దేశంలో తీవ్ర ఆర్ధిక అసమానతల ముఖచిత్రాన్ని కార్పొరేట్ల లాభాలు బహిరంగపరుస్తున్నాయి. మొత్తం దేశ జనాభాలో పైభాగంలోని 10% మంది వద్ద 77% సంపద పోగుపడింది. ఒక్స్ఫాం ప్రకారం, 2017లో సృష్టించిన 73% సంపద 1శాతమున్న అత్యంత సంపన్నులకు చేరింది. కటిక పేదవారైన 670 మిలియన్ ప్రజలలో సగం మంది ఆస్తిలో కేవలం 1% పెరుగుదల మాత్రమే నమోదైంది.
గడచిన కొన్ని సంవత్సరాలుగా భారత ఆర్ధికవ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతుందని నిపుణులు తరుచుగా అంటున్నారు. కానీ దేశం మాత్రం తీవ్ర అసమానతల మధ్య హెచ్చుతగ్గులతో ఉంది. ఎక్కవ వృద్ధి చూపించినా తక్కువ ఉపాధి సృష్టి, ఎక్కువ ఉత్పత్తి తక్కువ ఉత్పాదకత, నికర ఆస్తి పెరుగుదలతో సరి సమానంగా లోతైన అసమానతలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల నిరంతర సంక్షోభం మధ్య పట్టణ పట్టణాలలో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది.
“పెరుగుతోన్న అంతర్గత ఖర్చులను పాక్షికంగా వినియోగదారులపై విధిస్తున్న కార్పొరేట్లు”
కోవిడ్ తర్వాత డిమాండ్‌కు తగ్గట్టు అమ్మకాల జరిగాయి. అమ్మకాలలో పెరుగుదల వల్ల 2020- 21లో 2.5 ట్రిలియన్ నుంచి 2024-25 సంవత్సరంలో 7.1 ట్రిలియన్కు కార్పొరేట్ల లాభాలు గణనీయంగా పెరిగాయని ఆర్బీఐ బులిటెన్ తెలియజేసింది. అదే సమయంలో ఉత్పత్తి రంగం వల్ల 2024-25లో నికర లాభం రెండు డిజిట్ల స్థాయికి చేరుకొని మెరుగుదలను చూపింది.
కోవిడ్ అనంతరం ఐటీ రంగంలో కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో పాటు ఎక్కువ వేతనాల కారణంగా నికర లాభం అంతంత మాత్రంగానే వృద్ధిని సాధించింది. అలాగే ఐటియేతర సేవా రంగం నికర లాభం విషయంలో 2023- 24లో సానుకూల పరిస్థితికి రాకముందు, కోవిడ్ నుంచి నకారాత్మక పరిస్థితిని ఎదుర్కొన్నది.

లాభాలకు సంబంధించి అంతా బాగుందని అనిపిస్తున్నప్పటికీ, చెబుతున్న దానికి– వాస్తవానికి మధ్య పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. పెద్దమొత్తంలో భేదాలుండటం వల్ల అన్ని స్థాయిల్లో అస్థిరత ఏర్పడింది. అయితే ఐటియేతర రంగంలో ఆపరేటింగ్ లాభాల మొత్తంలో అస్థిరత కొనసాగుతుందని, 2016- 17లో 19.2% నుంచి 2018-19లో 11.7% తర్వాత తిరిగి 2023-24లో పుంజుకొని 22.4% లాభాన్ని సాధించింది.
కోవిడ్ కంటే ముందున్నకాలంలో మొత్తం లాభాలను సగటు తేడాలతో పోలిస్తే కోవిడ్ కాలంలో తక్కువ అంతర్గత ఖర్చు, ఆపరేటింగ్ లాభాల్లో తేడాలు 200బీపీఎస్ కంటే ఎక్కవగా మొత్తం స్థాయిలో లబ్దిపొందాయి. అయితే కోవిడ్ విజృంభణ తగ్గిపోవడంతో డిమాండ్‌కు తగ్గట్టు వస్తువుల ధరలు పెరగడం వల్ల కార్పొరేట్లు పెరుగుతున్న అంతర్గత ఖర్చుల భారాన్ని పాక్షికంగా తమ వినియోగదారులపై వేశారు. ఇది కోవిడ్ తర్వాత కాలంలో ఆధునిక ఆపరేటింగ్ లాభాల తేడాలో ప్రతిబింబిస్తుంది.

మొత్తం మీద లాభాల పర్వంలో పెద్ద కంపెనీలు ప్రాథమిక సహకారులుగా ఉద్భవించినట్లుగా నివేదిక కనుగొన్నది. చిన్న, మధ్యతరహా సంస్థలతో పోలిస్తే నిలకడగా ఎక్కువ ఆపరేటింగ్ లాభాల తేడాలను పెద్ద కంపెనీలు సాధించాయి. మహమ్మారి వల్ల అమ్మకాలు తగ్గినప్పటికీ “సంక్షోభ సమయంలో ఖర్చులలో సమర్ధవంతంగా కోత విధించే చర్యలను చేపట్టి సామర్ధ్యాన్ని పెంచుకోవడం ద్వారా” ఆపరేషనల్ లాభాల్లో తేడాలను మెరుగుపర్చుకున్నాయి.

అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
