* రెండు అమెరికా విమానాల కూల్చివేత
* ఒక సైనికుడిని రక్షించగా, మరొకరు గల్లంతు
“ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బతీసి పూర్తిగా సర్వనాశనం చేశామని”జాతిని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన రెండు రోజులకే అమెరికా విమానాలు కుప్పకూలాయి.
న్యూఢిల్లీ: ఇరాన్‌పై దాడి చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయం వల్ల పశ్చిమాసియాలో తీవ్ర సంక్షోభం తలెత్తింది.
తారా స్థాయికి చేరుకున్న ఈ సంక్షోభం శనివారం ఏప్రిల్ 4 నాటికి 36వ రోజుకు చేరుకుంది.
వేర్వేరు ఘటనల్లో రెండు అమెరికా విమానాలు కుప్పకూలిన తర్వాత, ఒక అమెరికా సైనికుడిని కాపాడగా, మరొకరి ఆచూకీ తెలియడం లేదు. యుద్ధం మొదలైన నాటి నుంచి విమానాలను కూల్చివేయడం ఇదే తొలిసారి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ “ఇరాన్‌ను చితకబాది పూర్తిగా నాశనం చేశామని” చెప్పిన కేవలం రెండు రోజుల తర్వాత ఈ అమెరికా విమానాలు కూల్చబడ్డాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
