ముందస్తు విచారణ లేదా అధికారికంగా నేరారోపణలు మోపబడకుండానే డోలేను 12 నెలల వరకు నిర్బంధించేందుకు అస్సాం ప్రభుత్వానికి అవకాశమిచ్చే ఈ కఠినమైన చట్టాన్ని జూలై 30న ఒక అధికారిక “సమాచారం” (communication) ద్వారా డోలేకు తెలియజేశారు.
న్యూఢిల్లీ:
అస్సాంకు చెందిన ఆదివాసీ/ప్రాంతీయ హక్కుల కార్యకర్త, ‘గ్రేటర్ కాజీరంగా ల్యాండ్ అండ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ’ కన్వీనర్ అయిన ప్రణబ్ డోలేపై జాతీయ భద్రతా చట్టం (NSA) మోపడాన్ని 60కి పైగా ప్రజా ఉద్యమాలు, సంస్థలు, కార్మిక సంఘాలు, ప్రజాస్వామ్య హక్కుల సంఘాలు పౌరులు తీవ్రంగా ఖండించారు. అస్సాం పోలీసులు పలువురు ఆదివాసీ స్థానిక హక్కుల పరి రక్షకులపై పెట్టిన అబద్ధపు కేసులో గోలాఘాట్ సెషన్స్ కోర్టు డోలేకు బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజే ఈ చర్య తీసుకోవడాన్ని వారు “ప్రతీకారం, కక్ష పూరిత చర్య”గా అభివర్ణించారు.
“అస్సాం ప్రభుత్వ ఆదేశంలో పేర్కొన్న కారణాలు, ప్రణబ్ ఒక సామాజిక, రాజకీయ క్రియాశీల పౌరుడిగా, హక్కుల పరిరక్షకుడిగా వ్యవహరించినందుకు ప్రభుత్వం ఆయనపై చూపిన కక్ష పూరిత, నియంతృత్వ పోకడలను బహిర్గతం చేస్తున్నాయి. ఆరోపించినట్లుగా రాష్ట్ర /దేశ భద్రతకు గానీ, శాంతిభద్రతల నిర్వహణకు గానీ ఎలాంటి భంగం కలిగించలేదని స్పష్టమవుతోంది” అని ఈ లేఖపై సంతకం చేసిన బృందం పేర్కొంది.
ఆ ప్రాంతంలో చేపట్టిన ధర్నా నిరసనకు సంబంధించి జూలై 12న అస్సాం పోలీసులు డోలేని అరెస్టు చేయగా, జూలై 29న స్థానిక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలోని కాజీరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ సరిహద్దులో ప్రతిపాదించిన ఫైవ్ స్టార్ లగ్జరీ రిసార్ట్ నిర్మాణాన్ని ఆయన, పలువురు స్థానిక కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఆయనకు బెయిల్ మంజూరు చేసే సమయంలో కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది: “పర్యావరణ పరిరక్షణ, స్థానిక ప్రజల జీవన పోరాటంతో ముడిపడి ఉన్న వ్యవహారాల్లో, స్థానిక ప్రజల ఆందోళనలను అణచివేయడానికి క్రిమినల్ చట్టాలను సాధారణంగా ఉపయోగించకూడదు.”
ముందస్తు విచారణ లేదా అధికారిక నేరారోపణలు లేకుండా డోలేను 12 నెలల వరకు నిర్బంధించేందుకు అస్సాం ప్రభుత్వానికి అవకాశమిచ్చే ఈ కఠినమైన చట్టాన్ని జూలై 30న ఒక అధికారిక “సమాచారం” ద్వారా డోలేకు తెలియజేశారు.
బెయిల్ పొందిన తర్వాత ఒక భూ హక్కుల కార్యకర్తపై ఈ చట్టాన్ని ప్రయోగించడం “తీవ్ర రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది” అని హక్కుల సంఘాలు తెలిపాయి. “ప్రభుత్వం వద్ద నేరానికి సంబంధించిన ఆధారాలు ఉంటే, ఆ ఆధారాలను కోర్టు ముందు ఉంచి, చట్ట ప్రకారం ప్రణబ్‌కు సంక్రమించే పూర్తి హక్కుల రక్షణను కల్పించాలి. సాధారణ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ద్వారా ఒక కార్యకర్తను జైలులో ఉంచడంలో విఫల మైనప్పుడల్లా ముందస్తు నిర్బంధం అనేది ప్రభుత్వాలకు ఒక ప్రత్యామ్నాయంగా మారకూడదు” అని వారు వ్యాఖ్యానించారు.
“ఇది కేవలం ఒక కార్యకర్తను లక్ష్యంగా చేసుకోవడం మాత్రమే కాదు. ఇది న్యాయ ప్రక్రియ యొక్క స్వతంత్రతపైనే దాడి చేస్తున్నది. ఒక కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను, కార్యనిర్వాహక వర్గానికి ఆ తీర్పు నచ్చ లేదనే ఒకే ఒక్క కారణంతో దొడ్డిదారిన దాడి చేయడం గర్హనీయం. అంతేకాక, చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ, అసాధారణ ముందస్తు నిర్బంధ చట్టాలను ఉపయోగిస్తూ, పౌరులకు కోర్టులు ఇచ్చే బెయిల్ ఉత్తర్వులను ప్రభుత్వం నిర్వీర్యం చేయడం ఒక ప్రమాదకరమైన ఆనవాయితీకి నాంది పలుకుతుంది” అని వారు పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద నిందితుడికి బెయిల్ పొందే హక్కుకు తీవ్ర ముప్పు అని వారు పేర్కొన్నారు.
రైతుల సమస్యలు, ప్రాజెక్టులు, అవినీతి, పౌరసత్వ పోరాటాల మధ్య అరెస్టు అయి, ఆ తర్వాత ఎన్ఎస్ఏ కింద కేసు నమోదు చేయబడిన రైతు నాయకుడు, అవినీతి వ్యతిరేక కార్యకర్త అఖిల్ గొగోయ్ (అప్పటి ‘కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి’ నాయకుడు) పై 2017లో అస్సాం ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి చర్య లాగా నేటి కేసు ఉందని ఈ లేఖ గుర్తుచేసింది.
2017 డిసెంబర్ 21న, గౌహతి హైకోర్టు ఆ నిర్బంధ ఉత్తర్వు చట్టపరంగా లోపభూయిష్టమైనదని పేర్కొంటూ ఆయన ముందస్తు నిర్బంధాన్ని రద్దు చేసింది. “అప్పుడు, ఇప్పుడు కూడా ప్రజా పోరాటాలతో ముడిపడి ఉన్న ఒక కార్యకర్తను అసాధారణ ముందస్తు నిర్బంధానికి అర్హుడైన ఒక ప్రమాదకరమైన శక్తిగా చిత్రించారు. అప్పుడు, ఇప్పుడు కూడా జాతీయ భద్రత, శాంతిభద్రతలకు అసాధారణ ముప్పులు ఏర్పడినప్పుడు ఉపయోగించాల్సిన చట్టాన్ని, ప్రభుత్వ విధానాలపై వచ్చే రాజకీయ విభేదాలను అణచివేయడానికి రాజ్యం ఉపయోగించింది” అని ఆ లేఖలో పేర్కొన్నారు.
భూసేకరణ, నిర్వాసితులు కావడం, పర్యావరణ వినాశకర ప్రాజెక్టుల నిర్మాణం, సహజ వనరులను కార్పొరేట్లు హస్తగతం చేసుకోవడాన్ని నిరసించే వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం, సుదీర్ఘకాలం జైలులో ఉంచడం, అసాధారణ చట్టాల కింద విచారణ జరపడం వంటి ఆందోళనకరమైన ధోరణి భారతదేశ వ్యాప్తంగా పెరుగుతోందని ఈ సంఘాలు విమర్శించాయి. “అభివృద్ధి విధానాలపై వచ్చే నిరసనలను, విభేదాలను జాతీయ భద్రతా ప్రశ్నలుగా మార్చేందుకు ప్రభుత్వాలను అనుమతించకూడదు. భూమి, పర్యావరణం, సహజ వనరుల పరిరక్షణపై తమ హక్కులను చాటుకునే ఆదివాసీ, స్థానిక వర్గాలు దేశానికి శత్రువులు కారు” అని వారు స్పష్టం చేశారు.
డోలేతో పాటు నిరసన తెలుపుతున్న వారిపై మోపిన ఎన్ఎస్ఏతో పాటు వారిపై తీసుకున్న ఇతర చర్యలన్నింటినీ వెంటనే ఉపసంహరించుకోవాలని సంతకం చేసినవారు డిమాండ్ చేశారు. బార్డువార్ వద్ద ప్రతిపాదిత శాటిలైట్ టౌన్షిప్ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించినందుకు ప్రస్తుతం జైలులో ఉన్న ఆదిత్య చంద్ర రభాతో సహా అస్సాంలో భూ పోరాటాలకు సంబంధించి జైలులో ఉన్న కార్యకర్తలు, స్థానిక ప్రజలందరినీ వెంటనే విడుదల చేయాలని, బూటకపు, రాజకీయ ప్రేరేపిత కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
నిరసన కారులపై ముందస్తు నిర్బంధ చట్టాలు, అసాధారణ చట్టాల వినియోగాన్ని నిలిపివేయాలని, పోలీసుల అక్రమాలపై స్వతంత్ర విచారణ జరిపించాలని, కాజీరంగా ప్రాజెక్టులో భూ కేటాయింపులను పూర్తి పారదర్శక సమీక్ష చేసి బహిర్గతం చేయాలని, అస్సాంలోని స్థానిక ఆదివాసీ, రైతు మరియు అటవీ ఆధారిత వర్గాల నిర్వాసిత నివారణకు మెరుగైన రక్షణ కల్పించాలని వారు పిలుపునిచ్చారు.
సంతకం చేసిన వారి జాబితా:
ఆదివాసీ అధికార మంచ్, ఉదయపూర్. ఆదివాసీ సమాజోన్నతి సేవా సంస్థ, సఫాలే, మహారాష్ట్ర.
ఆల్ ఇండియా ఫెమినిస్ట్ అలయన్స్ (ALIFA).
ఆల్ ఇండియా ఇంక్విలాబీ యూత్ అండ్ స్టూడెంట్స్ అలయన్స్ (ALIYSA).
అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (APCR). బస్తీ సురక్షా మంచ్.
క్యాంపెయిన్ ఎగైనెస్ట్ ఫ్యాబ్రికేటెడ్ కేసెస్, ఒడిశా. క్యాంపెయిన్ టు డిఫెండ్ నేచర్ అండ్ పీపుల్ (CDNP).
క్యాంపెయిన్ ఫర్ సర్వైవల్ విత్ డిగ్నిటీ, ఒడిశా.
సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ (CFA).
చెన్నై వెట్ ల్యాండ్స్ యాక్షన్ కలెక్టివ్.
సివిల్ సొసైటీ ఉమెన్స్ ఆర్గనైజేషన్, మేఘాలయ. చాషీ ములియా సంఘ్, ఒడిశా.
చాషీ ములియా సురక్షా సమితి, కంధమాల్.
ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్.
క్లైమేట్ ఫ్రంట్ ఇండియా, క్లైమేట్ ఫ్రంట్ జమ్మూ.
క్త్లెమేట్ ఫ్రంట్ తెలంగాణ.
దాబ్లా ఖనన్ విరోధి సంఘర్ష్ సమితి,
వేప-కా-థాన్, సికార్.
దర్శన్, అహ్మదాబాద్.
దిబాంగ్ రెసిస్టెన్స్, అరుణాచల్ ప్రదేశ్.
ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్, ఇండియా.
ఫ్రెండ్స్ ఆఫ్ ది ఎర్త్ – ఇండియా.
గ్రోత్ వాచ్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ అలర్ట్ – ఇండియా.
ఇండియన్ సోషల్ యాక్షన్ ఫోరమ్.
ఇండిజీనస్ రీసెర్చ్ అండ్ అడ్వకేసీ, అరుణాచల్ ప్రదేశ్.
జాగ్రత్ ఆదివాసీ దళిత్ సంస్థాన్.
జాయింట్ యాక్షన్ ఎగైనెస్ట్ కస్టోడియల్ టార్చర్, తమిళనాడు.
జస్టిస్ ఇన్ మైనింగ్ నెట్వర్క్. కల్పవృక్ష్.
కరావళి కర్ణాటక జనాభివృద్ధి వేదిక.
కష్టకారి సంఘటన, దహను, మహారాష్ట్ర.
ఖండువాల్ మాలి స్థాయి సురక్షా సమితి, కలహండి.
జోధ్‌పురా సంఘర్ష్ సమితి, కోట్‌పుట్లి.
లెట్ ఇండియా బ్రీత్. లోక్‌శక్తి అభియాన్, ఒడిశా.
మా మాటి మాలి సురక్షా మంచ్ (కలహండి & రాయగడ).
మంథన్ అధ్యయన్ కేంద్ర.
మ్యూజ్ ఫౌండేషన్.
నేషనల్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అండ్ ఎకోలాజికల్ జస్టిస్.
నేషనల్ అలయన్స్ ఫర్ జస్టిస్, అకౌంటబిలిటీ అండ్ రైట్స్.
నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్.
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్మాల్-స్కేల్ ఫిష్ వర్కర్స్.
న్యూ ట్రేడ్ యూనియన్ ఇనిషియేటివ్ (NTUI).
నియమ్‌గిరి సురక్షా సమితి.
నార్త్ ఈస్ట్ హ్యూమన్ రైట్స్.
ఓఖామండల్ పర్యావరణ్ జన్ సంఘర్ష్ సమితి, ఓఖా, గుజరాత్.
పర్యావరణ్ సురక్షా సమితి, గుజరాత్.
పీపుల్ ఫర్ హిమాలయా.
పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (PUCL).
పీపుల్స్ వాచ్.
రాజస్థాన్ అసంగఠిత్ మజ్దూర్ యూనియన్.
సమతా.
సర్వహార జన్ ఆందోళన్.
సౌరాష్ట్ర దళిత్ సంస్థాన్, జునాగఢ్.
సేవ్ దోల్ కా బాధ్ ఆందోళన్.
శోషిత్ జన్ ఆందోళన్.
సౌత్ ఆసియా జస్ట్ ట్రాన్సిషన్ అలయన్స్ ఇండియా.
స్టూడెంట్స్ అండ్ యూత్ కలెక్టివ్, అహ్మదాబాద్.
దేర్ ఈజ్ నో ఎర్త్ బి.
వాంగడ్ కిసాన్ మజ్దూర్ సంస్థాన్, మరియు ఇతర సంఘాలు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
