మూలధన టర్నోవర్ సమస్యను మనం విస్మరించాము. కొన్ని పరిశ్రమలలో మూలధన టర్నోవర్కు (యంత్రాలు మొదలైనవి వాటి విలువను అన్నింటినీ ఉత్పత్తి ఒకే సమయంలో ఉత్పత్తికి ఇవ్వవు) చాలా సంవత్సరాలు పడుతుంది.
ఇక్కడ మనం ‘స్వచ్చమైన సర్క్యులేటింగ్ మూలధన పద్దతి’ అని పిలవబడే పద్దతిని ఉపయోగిస్తాము.
స్థిర మూలధనంలో ఒక భాగమైన యంత్రాలు, అటువంటివి (ముడి, సహాయక పదార్ధాలతో పాటు) ఉత్పత్తి ఒకే ఒక్క కాలం, ఒక సంవత్సరంగా తీసుకున్న కాలంలో పూర్తిగా వినియోగించబడుతున్నాయని భావించడం అయ్యింది.
మూలధన సజీవ కూర్పులోని వ్యత్యాసానికి తోడు, టర్నోవర్ వ్యవధిలోని వ్యత్యాసాలు కూడా లాభాల రేటును ప్రభావితం చేస్తాయని నొక్కి చెప్పవలసిన అవసరం ఉంది. మార్క్స్కు ఈ సమస్యను గురించి పూర్తిగా తెలుసు. పెట్టుబడి 2– 3 సంపుటాలలోనూ, అదనపు విలువ సిద్ధాంతాలలోనూ కూడా ఈ సమస్యను విశ్లేషించాడు. ఏమైనప్పటికీ, ఇక్కడ మనం ఈ అంశాన్ని లోతుగా వివరించలేము.
ఖర్చు- ధరకు (i)లాభం సగటు సామాజిక రేటును (మొత్తం సామాజిక అదనపు విలువను, సామాజిక మూలధనంతో భాగించి) నిర్ణయించడం ద్వారా, (ii) ఖర్చు ధరను ఈ లాభాల రేటుతో గుణించడం ద్వారా వచ్చిన లాభాన్ని జోడించడం ద్వారా మనం ఉత్పత్తి ధరలను నిర్దారించాము. కానీ పెట్టుబడిదారుల మధ్య ఉత్పత్తి సాధనాల కొనుగోలు, అమ్మకాలకోసం లావాదేవీలు ధరల పరంగా నిర్వహిస్తారు. దీనర్ధం ఖర్చు- ధర కూర్చబడిన అంశాలలో వాటి ఉత్పత్తి ప్రారంభ దశల నుంచి పెట్టుబడిపై వచ్చిన లాభం కలిసి ఉంటుంది.
ఉదాహరణకు గృహోపకరణాలు తయారు చేయడానికి నేను కొనే ఉక్కు నా ఖర్చు-ధరకు సంబంధించిన ఒక అంశం, కానీ నేను దానిని, దాని విలువ వద్దకాక ఉత్పత్తి ధర వద్ద కొంటాను; ఆ విధంగా నేను కొనే ఉక్కుకు నేను చెల్లించే ధరలో ఉక్కు ఉత్పత్తిదారుని లాభం కూడా కలిసి ఉంటుంది. కాబట్టి పరివర్తన సమస్యకు మన సాధారణ పరిష్కారంలో పైన చేసినట్లు, వ్యయ-ధరను పూర్తిగా విలువపరంగా లెక్కించలేము.
మార్క్స్కు ఈ సమస్య గురించి పూర్తిగా తెలుసు: ఒక సరుకు ఖర్చు- ధర దాని ఉత్పత్తిలో వినియోగించిన సరుకుల విలువకు సమానమని మనం మొట్టమొదట ప్రస్థావించాము. కానీ కొనేవానికి నిర్దిష్ట సరుకు ఉత్పత్తి ధర దాని ఖర్చు- ధర. అందువల్ల ఇతర సరుకుల ధరలలోకి ఖర్చు- ధరగా మారవచ్చు. ఖర్చు- ధర ఈ సవరించిన ప్రాముఖ్యతను గుర్తించుకోవడం అవసరం, ఏ ప్రత్యేక రంగంలోనైనా అది వినియోగించిన ఉత్పత్తి సాధనాల విలువతో గుర్తించినప్పుడు, ఏదైనా లోపం జరగడానికి అవకాశం ఎల్లప్పుడూ ఉన్నదని మనస్సులో ఉంచుకోవాలి.
అయితే, ఉత్పత్తి ధరల సిద్ధాంతంలోకి ఈ అంశాన్ని క్రమపద్దతిలో చేర్చడానికి మార్క్స్ జీవించి లేడు. ఆ కారణంగా, పరివర్తన సమస్యకు అతని నిర్దిష్ట పరిష్కారం అసంపూర్ణంగా మిగిలిపోయింది. సమస్య తార్కిక అంశాలు అప్పటి నుంచి విలువలకూ ఉత్పత్తి ధరలకూ మధ్య స్పష్టమైన సమన్వయం ఉన్నదనే అర్ధంలో, సంతృప్తికరంగా పరిష్కరించబడ్డాయి.
అందుచేత, దాని ఉజ్జాయింపు పాత్ర ఉన్నప్పటికీ, పరివర్తన సమస్య సారాంశంతో మార్క్స్ పరిష్కారం సరిపడా వ్యవహరిస్తుంది.
పరివర్తన సమస్య ప్రాముఖ్యత..
పరివర్తనకు సంబంధించిన తార్కిక వివరాలతో ప్రత్యేక సంబంధం కలిగి ఉన్నారని పెట్టుబడిదారీ అర్ధశాస్త్రవేత్తలు అన్నారు. (స్పృహ ఉందో లేకో) సైద్ధాంతిక కారణాలవలన కొంత వరకు ప్రేరేపించబడి, సాధారణంగా సమస్య అసలైన చారిత్రక ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యారు.
మార్క్స్ పరిష్కారంలోని అసంపూర్ణతను ప్రారంభంలో చేజిక్కించుకున్నప్పటికీ, విలువల నుంచి ఉత్పత్తి ధరలు ఉత్పన్నమౌతాయనే, మార్క్స్ ప్రాథమిక సూత్రీకరణను సమర్ధించే తార్కిక, సంపూర్ణ పరిష్కారం ఉందని అప్పటి నుంచి వారు గుర్తించవలసివచ్చింది. ప్రస్తుతం తమ వాదనను మార్చారు, ఖచ్చితమైన ‘విలువ’ – ఉత్పత్తి ధరల మధ్య సమన్వయం ఉనికిలో ఉన్నప్పటికీ, పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ విశ్లేషించడంలో విలువ భావనను ఉపయోగించడం పూర్తిగా అనవసరమని వాదిస్తున్నారు.
మీరు తార్కికంగా (ఉత్పత్తి ధర వంటి) స్థిరమైన ధరల వ్యవస్థను కలిగి ఉంటే మీకు ‘విలువ’ అవసరం లేదన్నది వారి వాదనలా కనుపిస్తున్నది. ఇది తీవ్రమైన తప్పు వాదనని చూపించడానికి ప్రస్తుతం మనం ప్రయత్నిస్తాము.
ఉత్పత్తి ధరలను పొందడాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా ప్రారంభిద్దాము.
మనం సగటు లాభాల రేటును ఉపయోగించాల్సి వచ్చింది. మొత్తం సామాజిక మూలధనానికీ మొత్తం సామాజిక అదనపు విలువకూ మధ్య గల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకొని మనం ఈ సగటు రేటును పొందాము. మరొక మాటలో చెప్పాలంటే లాభానికీ, లాభాల రేటుకూ వెనుక ఉన్నది అదనపు విలువా, అదనపు విలువ రేటును. పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థలో, ‘విలువ’తో ప్రారంభించి, మరింత క్లిష్టమైన ధరల నిర్ణయంగా ‘ఉత్పత్తి ధరను’ అభివృద్ధి చేయడంలో మార్క్స్ అనుసరించిన పద్దతి (చాలా సరళంగానే ఉన్నప్పటికీ) ప్రాముఖ్యతను గుర్తించడం ఇప్పుడు సాధ్యమౌతుంది.
మార్క్స్ పథకం, సారంలో ఈ విధంగా ఉంది: ఒక చారిత్రక భౌతికవాదిగా, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని దాని ప్రాథమిక సామాజిక సంబంధాల పరంగా, కార్మిక వర్గానికీ, పెట్టుబడిదారీ వర్గానికీ మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించడం ద్వారా అతను ప్రారంభించాడు.
పెట్టుబడి సంపుటి 1లో అభివృద్ధి చేసిన ‘విలువ’ విశ్లేషణ ఈ ప్రాథమిక సంబంధంపై దృష్టి పెడుతుంది. మూలధనానికీ – వేతన జీవులకూ గల సంబంధం ఆధారంగా జరిగే సరుకుల ఉత్పత్తే ఈ పద్దతిలో సామాజిక ఉత్పత్తి. అందువల్ల ఉత్పాత్తులు విలువల పాత్రను తీసుకుంటాయి, అదనపు విలువను పెట్టుబడిదారీ వర్గం కార్మికవర్గాన్ని దోచుకోవడం ద్వారా (శాస్త్రీయంగా నిర్వచించబడింది) స్వాధీనం చేసుకుంటుంది.
విలువ– అదనపు విలువ సమస్య, అదనపు విలువ ఉత్పత్తికీ ఇంకా కార్మిక వర్గానికీ, పెట్టుబడిదారీ వర్గానికీ మధ్య సంబంధానికి సంబంధించినది. మరొక వైపు ధర సమస్య పెట్టుబడిదారుల మధ్య అదనపు విలువ పంపకానికి సంబంధించినది. అంతేకాకుండా, ఆ విధంగా పెట్టుబడి దారీ వర్గంలోని అంతర్గత సంబంధాలకు సంబంధించినది. అందుచేత ఈ దిగువన ఇచ్చిన రెండు ప్రాథమిక కారణాలరీత్యా ‘విలువ’ పరంగా విశ్లేషణ ఖచ్చితంగా అవసరం:
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన ప్రాథమిక సామాజిక సంబంధాలను ఇది నగ్నంగా చూపుతుంది. ప్రత్యేకించి శ్రమకూ, మూలధనానికీ మధ్య(చట్ట బద్ధంగానూ ఇతరత్రా) సమానత్వం ఉన్నట్లు కనపరచే మాయా పొరను ఇది చీల్చి వేస్తుంది. కార్మిక వర్గాన్ని, పెట్టుబడిదారీ వర్గం చేస్తున్న దోపిడీని, శాస్త్రీయ దృక్పథం ‘కార్మికుల’ అదనపు శ్రమను పెట్టుబడి స్వాధీనం చేసుకోవడాన్ని ఇది స్పష్టంగా చూపుతుంది.
సగటు లాభాల రేటును నిర్ణయించడానికి ఆధారాన్ని అందించడం ద్వారా ఇది ‘విలువ’ను ప్రాథమికమని చూపిస్తుంది. లేదా ధరలను సాధారణంగా నిర్ణయించడాన్ని చూపిస్తుంది. ‘విలువ’, విలువల సంబంధాల ఆధారంగా మాత్రమే మరింత క్లిష్టమైన ఉత్పత్తి ధరను నిర్వచించడం జరిగింది.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 45వ భాగం, 44వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
