2026 ఏప్రిల్‌లో నిరుద్యోగిత రేటు కంటే మే నెలలో పెరుగుదల నమోదైంది.
పురుషుల నిరుద్యోగిత రేటు ఏప్రిల్‌లో 5.1 శాతం కాగా, మే నెలలో 5.4 శాతంగా ఉంది.
మహిళల నిరుద్యోగిత రేటు ఏప్రిల్‌లో 5.4 శాతం కాగా, మే నెలలో 5.6 శాతానికి చేరింది.
న్యూఢిల్లీ: భారతదేశ నిరుద్యోగ రేటు మే నెలలో 11 నెలల గరిష్ఠ స్థాయికి, అంటే సగటున 5.5 శాతానికి పెరిగింది.
జాతీయ గణాంకాల కార్యాలయం జూన్ 15న విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) తాజా నెల బులెటిన్ ప్రకారం, ఏప్రిల్‌లో ఇది 5.2 శాతంగా ఉందని బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది.
క్షీణించిన కార్మిక భాగస్వామ్యం, ఉపాధి రేటు..
ప్రతి 1,000 మందిలో ఉపాధి పొందిన వ్యక్తుల సంఖ్యను చూపించే కార్మిక జనాభా నిష్పత్తి(డబ్ల్యూపీఆర్), ఏప్రిల్‌లో 52.2 శాతం నుంచి మే నెలలో 51.4 శాతానికి తగ్గింది.
ఇది 11 నెలలలో కనిష్ఠ స్థాయికి చేరుకుందని పీఎల్ఎఫ్ఎస్ సూచించింది.
ఇదిలా ఉండగా, జనాభాలో పనిచేస్తున్న లేదా పని కోసం చురుకుగా వెతుకుతున్న వారి శాతం, కార్మిక శక్తి భాగస్వామ్య రేటు(లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో – ఎల్ఎఫ్పీఆర్) ఏప్రిల్‌లో ఉన్న 55 శాతం నుంచి మే నెలకి 54.4 శాతానికి తగ్గి గత 11 నెలల్లో కనిష్ఠ స్థాయికి చేరుకుంది.
కార్మిక మార్కెట్‌పై తగ్గిన అవకాశాల ప్రభావం..
ఈ కాలంలో ఎల్ఎఫ్పీఆర్, డబ్ల్యూపీఆర్ తగ్గడం, అదే సమయంలో నిరుద్యోగ రేటు పెరగడం వలన కార్మికులకు పని దొరకడం తగ్గుతోందని నివేదిక తెలియజేస్తున్నది. లేబర్ మార్కెట్ పరిస్థితులు పనిచేస్తున్న కార్మికులకు (ఎల్ఎఫ్పీఆర్) స్వల్పంగా తగ్గినప్పటికీ, ఉద్యోగ అవకాశాలు చాలా వేగంగా క్షీణించాయి. దీనివల్ల కార్మికులలో నిరుద్యోగులు పెరిగారు. మే 2026లో ఆర్థిక కార్యకలాపాలు సీజనల్ మార్పుల వలన లేబర్ మార్కెట్ మందగించడం కూడా కారణం కావచ్చు” అని జాతీయ గణాంకాల సంస్థ(ఎన్ఎస్ఓ) తెలిపింది.
యువత, మహిళల్లో పెరుగుతున్న నిరుద్యోగం..
గతంలో “ది వైర్” చెప్పినట్లు, 15-29 సంవత్సరాల వయస్సు గల యువతలో జనవరి-మార్చి త్రైమాసికంలో నిరుద్యోగిత 15 శాతానికి పెరిగింది.
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఇది 14.3 శాతంగా ఉంది.
ఏప్రిల్‌లో 5.1 శాతంగా ఉన్న పురుషుల నిరుద్యోగ రేటు మే నెలలో 5.4 శాతానికి, మహిళల నిరుద్యోగ రేటు ఏప్రిల్ నెలలో 5.4 శాతం నుంచి మే నెలలో 5.6 శాతానికి పెరిగింది.
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే విధానాన్ని గత సంవత్సరం జనవరిలో కరెంట్ వీక్లీ స్టేటస్ (సీడబ్ల్యూఎస్) పద్ధతిలోకి సవరించారు.
దీని ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి, నిరుద్యోగితకు ముఖ్య సూచికలను దేశవ్యాప్తంగా ప్రతి నెల అంచనా వేయడం ప్రారంభించారు.
సంక్షిప్త సారాంశం:
1. నిరుద్యోగిత రేటు 5.2 శాతం నుంచి 5.5 శాతానికి పెరిగింది.
2. ఉద్యోగాల్లో ఉన్న వారి శాతం (డబ్ల్యూపీఆర్) తగ్గింది. ఉద్యోగం చేస్తున్న వారి శాతం (ఎల్ఎఫ్పీఆర్) కూడా తగ్గింది.
3. యువతలో నిరుద్యోగిత 15 శాతానికి చేరింది.
4. ఉద్యోగ అవకాశాలు తగ్గడం వల్ల కార్మిక మార్కెట్ బలహీనపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
అనువాదం: జె. నాగేశ్వరరావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
