ప్రముఖుడైన రాజ గోపాల్ వంటి వారికే ఇలా జరిగింది. అధికారుల కలం పోటుతో ఓటు హక్కును కోల్పోయిన ఇతరుల అదృష్టం ఎలా ఉంటుంది?ఎవరు కూడా వారి గొంతుకను వినకపోవడాన్ని ఊహించుకోవచ్చని ఒక ప్రకటనలో ఈజిఐ పేర్కొంది.
న్యూఢ్ఇల్లీ: ప్రముఖ జర్నలిస్టు, ది టెలిగ్రాఫ్ పత్రిక మాజి సంపాదకులు ఆర్. రాజగోపాల్ పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, ఆయన పాస్‌పోర్టును అధికారులు రిన్యూవల్ చేయకపోవడాన్ని, ఎడిటర్స్ గిల్ఢ్ ఆఫ్ ఇండియా (ఈజిఐ) తీవ్రంగా ఖండించింది.
ఓటరుగా రాజగోపాల్ గుర్తింపును వెంటనే పునరుద్ధరించాలని జూన్28న జారి చేసిన ఒక ప్రకటలో ఈజిఐ డిమాండ్ చేసింది.
” ఎవరు భారత పౌరులు ఎవరు కాదు అని నిర్ణయిస్తున్న అధికారులు కొల్కత్తా-కేంద్రంగా ఉన్న ప్రముఖ దిన పత్రిక “ది టెలిగ్రాఫ్” మాజి సంపాదకులు ఆర్. రాజగోపాల్ పట్ల వ్యవహరిస్తున్న తీరును”, ది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. ఈజిఐ అధ్యక్షులు సంజయ్ కపూర్, ప్రధాన కార్యదర్శి రాఘవన్ శ్రీనివాసన్, కోశాధికారి రహెమాన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
జర్నలిస్టుగా, సంపాదకునిగా దశాబ్ధాల పాటు ప్రజల సమక్షంలో ఉంటూ పని చేస్తున్న రాజగోపాల్ ఈరోజు ఓటరు జాబితా నుంచి పేరును తొలగించడంతో ఓటు హక్కును కోల్పోవడమే కాదు, 100 రోజులకు పైబడి తన పాస్‌పోర్టును రిన్యూవల్ చేసుకోలేక పోతున్నానని అన్నారు. నగరానికి చెందిన ప్రముఖ పత్రికల్లో ఒక దానికి సంపాదకునిగా రాజగోపాల్‌తో పరిచయం ఉన్న కొల్కత్తా పోలీసుల నుంచి ” ప్రతికూలమైన రిపోర్టు” కారణంగానే ఇలా జరుగుతున్నదని” ఈజిఐ నాయకులు ఆరోపించారు.
ఓటర్ల జాబితాలో రాజగోపాల్ పేరు లేకపోవడాన్ని ఆధారంగా చేసుకొని పోలీసు విచారణను నిరాకరించినట్లు కనబడుతుందని, ఆ ప్రకటన పేర్కొంది.
“భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక విస్తృత సవరణ కారణంగా లక్షలాది మంది భారతీయుల దుస్థితికి రాజగోపాల్ పరిస్థితి అద్దం పడుతుందని” ఈజిఐ తెలిపింది.
“వీలైనంత త్వరగా ఓటర్‌గా రాజగోపాల్ గుర్తింపును పునరుద్ధరించాలి”
ప్రముఖ వ్యక్తి రాజగోపాల్కే ఇలా జరిగితే అధికారుల కలం పోటుతో ఓటు హక్కును కోల్పోయిన ఇతరుల అదృష్టం ఎలా ఉంటుంది? అలాంటి వారి గోడు ఎవరు వినకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.
” విజ్ఙతను ప్రదర్శిస్తూ, సంఘీభావాన్ని తెలియజేసి ఓటర్‌గా వీలైనంత త్వరగా రాజగోపాల్ గుర్తింపును పునరుద్ద రించాలని ఈసిని ఈజిఐ కోరింది. ఈ విధంగా ఓటు హక్కు తొలగించబడిన వారందరికి కూడా తిరిగి పరిశీలనను పోడిగించాలని” ఒక ప్రకటనలో ఈజిఐ డిమాండ్ చేసింది.
ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించిన నాటి నుంచి రాజగోపాల్ తన ఓటు పునరుద్ధరించాలని కోరినా ఫలితం లేదు. అందుచేత 2026 ఏప్రిల్ లో జరిగిన పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో ఓటు వేయలేక పోయారు. దానితో పాటు ఓటరు జాబితా నుంచి పేరును తొలగించడం వల్లనే పాస్‌పోర్టును రిన్యూవ్ చేయడం లేదని అధికారులు చెపుతున్నారు. దిని ఫలితంగా అమెరికాలో తన కూతురు వివాహనికి కూడా రాజగోపాల్ వెళ్లలేక పోయారు.
ది వైర్ స్టాఫ్
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
