బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి రాష్ట్రంలోని ప్రతి జిల్లా, మున్సిపాలిటీ, పంచాయతీలలో ఆర్ఎస్ఎస్ విద్యా విభాగమైన ‘విద్య భారతి‘ నిర్వహించే పాఠశాలలను ఏడాది వ్యవధిలో కనీసం 1,000 ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రాష్ట్రంలోని నాలుగు విద్యా శాఖలను ఒకే యూనిట్‌గా విలీనం చేసే ప్రణాళికను కూడా ఆయన ప్రతిపాదించారు. ముస్లింల మదర్సా విద్యకు ప్రత్యేక వ్యవస్థ ఉండదని స్పష్టం చేశారు.
రామకృష్ణ మిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్‌లో జరిగిన విద్య భారతి 74వ వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన అధికారి, తాను “జాతీయవాద విద్య” అని పిలిచే దానిని అందించే బాధ్యతను ఈ సంస్థ తీసుకోవాలని కోరారు.
అధికారులను కలిసేందుకు, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్ఎస్ఎస్ ఉన్నతాధికారులను సచివాలయానికి ఆహ్వానించారు.
రాష్ట్రంలోని 4 విద్యా శాఖలను ఒకే యూనిట్‌గా విలీనం చేస్తామని, మదర్సా విద్యకు ప్రత్యేక వ్యవస్థ ఉండదని సీఎం తెలిపారు.
టీఎంసీ సిలబస్ మార్పులపై విమర్శలు..
బెంగాల్లో ప్రస్తుతం ఇటువంటి పాఠశాలలు 313 ఉన్నాయి. దేశవ్యాప్తంగా, విద్య భారతి 12,000 కంటే ఎక్కువ పాఠశాలలను, 10,000 బాల సంస్కార కేంద్రాలను నడుపుతున్నది.
ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలలో “ఎక్కువ దేశద్రోహ కార్యకలాపాలు జరుగుతున్నాయి” అని ఆరోపిస్తూ, ఈ జిల్లాల్లో మరింత ఎక్కువ ఆర్ఎస్ఎస్ పాఠశాలలను నెలకొల్పడంపై ఆర్ఎస్ఎస్ దృష్టి సారించాలని సీఎం కోరుకుంటున్నట్లు తెలిపారు.
గతంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వం విద్యా వాతావరణాన్ని కలుషితం చేసిందని, రాష్ట్రం దీని నుంచి బయటపడటానికి విద్య భారతి వంటి సంస్థలు సహాయపడవలసి ఉంటుందని ఆయన అన్నారు.
ప్రజలను విభజించడానికి టీఎంసీ బెంగాలీ సిలబస్‌ను కూడా మార్చిందని ఆయన ఆరోపించారు. “తల్లిని ‘మా’ అని కాకుండా ‘అమ్మా’ అని పిలిచారు.
ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ లేదా స్వామి వివేకానందల పాఠాలను విస్మరించే విధంగా సిలబస్ రూపొందించబడింది.”
ఒకే దేశం, ఒకే విద్యా విధానం..
శ్యామ ప్రసాద్ ముఖర్జీ “ఏక్ దేశ్, ఏక్ విధాన్, ఏక్ నిషాన్, ఏక్ ప్రధాన్” పిలుపును ప్రస్తావిస్తూ, ఇది విద్యకు కూడా వర్తిస్తుందని సీఎం అన్నారు. “ఉన్నత విద్యా శాఖ అన్ని విశ్వవిద్యాలయాలను చూసుకుంటుంది. మరొక శాఖ ఆలియా విశ్వవిద్యాలయాన్ని చూసుకుంటుంది అనే ఏర్పాటును మేము అనుమతించము” అని ఆయన అన్నారు.
ఆలియా విశ్వవిద్యాలయాన్ని ప్రస్తుతం రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తోంది. “నేను బోర్డు టాపర్లను సత్కరించాను. తరువాత, మైనారిటీ వ్యవహారాల శాఖ 27 మంది ముస్లిం విద్యార్థుల పేర్లతో ఉన్న ప్రత్యేక ఫైల్‌ను పంపింది. ఎందుకని నేను అడిగాను? నేను ఇప్పటికే 20 మంది విద్యార్థులను సత్కరించాను, వారిలో ముస్లింలు, జైనులు, బౌద్ధులు ఉన్నారు” అని చెప్పారు.
భారతీయత, దేశభక్తితో కూడిన విద్య..
విద్య భారతి అధికారి ఆనంద్ రావు టీఓఐతో మాట్లాడుతూ, తమ పాఠశాలలు విద్యార్థులకు “భారతీయత”తో పాటు పూజా ఆచారాలలో శిక్షణ ఇస్తాయని చెప్పారు. కొన్ని పాఠశాలలు 5వ తరగతి వరకు నడుస్తుండగా, మరికొన్ని 8, 10, 12 తరగతుల వరకు నడుస్తున్నాయి. విద్య భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ వెబ్సైట్ ప్రకారం, “హిందూత్వానికి కట్టుబడి, దేశభక్తి భావనతో కూడిన యువతరాన్ని తీర్చిదిద్దడానికి తోడ్పడే విద్యా విధానాన్ని అభివృద్ధి చేయడం” దాని ప్రధాన దృష్టి (విజన్) అని చెప్పారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో తెలుగు అనువాదం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
